
మువ్వన్నెల పండగకు ఏర్పాట్లు పూర్తి
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవం(మువ్వన్నెల పండగ) నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ గురువారం తెలిపారు. ఆగస్టు 15వ తేదీన జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారన్నారు. అనంతరం పోలీస్ పరేడ్ ప్రదర్శన, ప్రగతిపై సందేశం, పోలీస్ దళాల మార్చ్‌ఫాస్ట్, రిట్రీట్, వివిధ శాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాల బహూకరణ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమ వీక్షణకు వచ్చే ప్రజల సౌకర్యార్థం ఏర్పాట్లు కూడా చేశామని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా ఏర్పాట్లు చేశామన్నారు.
589 మందికి ప్రశంసా పత్రాలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని పలు శాఖలు, స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్న 589 మంది ప్రశంసా పత్రాలు అందజేస్తామని కలెక్టరేట్ వర్గాలు ప్రకటించాయి.

మువ్వన్నెల పండగకు ఏర్పాట్లు పూర్తి