
● రేషన్ అవస్థలు
రేషన్ బియ్యం పంపిణీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం..గిరిజనుల పాలిట శాపంగా మారింది. అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసి, మళ్లీ పాత విధానంలోనే రేషన్ షాపుల వద్దనే రేషన్ సరుకుల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గిరిజనులకు కష్టాలు మొదలయ్యాయి. కొన్ని కిలోమీటర్ల మేర కొండలు, వాగులు, వంకలు దాటుకుని కాలినడకన రేషన్ షాపు వద్దకు చేరుకుని, అక్కడ కొన్ని గంటల పాటు వేచి ఉండగా వచ్చిన రేషన్‌ను మళ్లీ నెత్తిన పెట్టుకుని కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయని, జగనన్న హయాంలోనే బాగుండేదని ఎండీయూ వ్యాన్ ద్వారా గ్రామంలోకి రేషన్ వచ్చేదని అంటున్నారు. అదే విధానాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
–సాలూరు రూరల్

● రేషన్ అవస్థలు