
● డోలీలతో నిరసన
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ శృంగవరపుకోట మండలంలోని దారపర్తి గెడ్డ వద్ద గిరిజనులు గురువారం వినూత్న నిరసన చేపట్టారు. డోలీలు చూపిస్తూ ఇక్కడి గెడ్డను దాటాలంటే నీటి ప్రవాహంలో గెడ్డను దాటలేని చిన్నారులు, వృద్ధులను ఇలా డోలీలో మోసుకుని వెళ్లాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. దారపర్తి, మారిక డి.కెపర్తి, మూలబొడ్డవార పంచాయతీల్లోని గిరిశిఖర గ్రామాలకు నేటికీ రోడ్డు సదుపాయం లేదని, గెడ్డలపై వంతెనలు కూడా లేవని దీంతో తామంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పాలకులు మారుతున్నా తమ బాధలు మాత్రం తీరడం లేదని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రోడ్లు, వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. – శృంగవరపుకోట