
అదుపు తప్పి బోల్తా పడిన పొక్లెయినర్
మెంటాడ: మండలంలో వాణిజి గ్రామం నుంచి అనంతగిరి మండలం బూరుగ గ్రామానికి రోడ్డు వేసే పనులు జరుగుతున్నాయి. మంగళవారం పనులు పూర్తయిన తరువాత పొక్లెయినర్‌ను ట్రాలీపైకి ఎక్కిస్తుండగా అదుపు తప్పి లైటింగ్ చూపిస్తున్న బీహార్‌కు చెందిన ట్రాలీ డ్రైవర్ ప్రమోద్‌కుమార్, మెంటాడకు చెందిన తాడ్డి రాంబాబులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాలీ డ్రైవర్ ప్రమోద్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, తాడ్డి రాంబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి ఎస్‌ఐ సీతారాం చేరుకుని గాయాల పాలైన రాంబాబును జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. మృతి చెందిన ప్రమోద్‌కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సీతారాం తెలిపారు.
ఒకరి మృతి