
కళాశాల విద్యార్థుల మధ్య కొట్లాట
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థుల మధ్య ఘర్షణ కొట్లాటకు దారితీసింది. ఈ నెల 18న నిర్వహించనున్న ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి సంబంధించి ఎంట్రీ పాస్‌ను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి పోగొట్టుకోవడంతో రెండో ఏడాది ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు వారికి మధ్య ఘర్షణ జరగడంతో ఆ ఘర్షణ కాస్త కొట్లాటకు దారి తీసిందిసింది. కళాశాల అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఇరు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ అనంతరం కొట్లాటకు దారి తీయడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గాయాలైన విద్యార్థులు చేరినట్టు ఈ మేరకు ఔట్ పోస్ట్ పోలీస్ సిబ్బంది వివరాలు సేకరించినట్టు తెలిపారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన పుర్తి వివరాలను విద్యార్థుల నుంచి సేకరించి కేసు నమోదు చేస్తున్నట్టు పట్టణ ఎస్‌ఐ గోవింద తెలిపారు.