
ఆల్బెండజోల్ మాత్రలను తప్పక తీసుకోవాలి
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి, పార్వతీపురం మన్యం:
కూటమి ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ప్రారంభించనున్న సీ్త్ర శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పరిమితంగానే లబ్ధి కలిగించనుంది. కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులకు మాత్రమే వర్తించనుంది. దీనికితోడు.. జిల్లా నుంచి అటు పాలకొండ, ఇటు సాలూరు, కురుపాం, గుమ్మలక్ష్మీపురం వైపు మార్గాల్లో అధిక శాతం పల్లె వెలుగులే ఉన్నాయి. విజయనగరం వెళ్లే ఎక్స్ ప్రెస్ సర్వీసులు కూడా తక్కువే. దీంతోపాటు చాలా మారుమూల, ఏజెన్సీ ప్రాంతాలకు బస్సులే నడవవు. ఉన్నా కూడా.. కేవలం నిర్దిష్ట సమయంలోనే. దీంతో చాలా మంది ప్రయాణికులు ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఈ రూట్లలో ఉచిత ప్రయాణం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విశాఖ వంటి ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు దాదాపుగా డీలక్స్ బస్సులనే ఆశ్రయిస్తారు. పల్లె వెలుగు ఎక్కితే.. విజయనగరానికే 3.30 గంటల సమయం పడుతుంది. మధ్యలో వంతెనల దగ్గర ట్రాఫిక్ జామ్, మానాపురం గేటు వంటివి పడితే వెళ్లే సమయాన్ని అంచనా వేయడం కష్టమే. అందుకే చాలా మంది ప్రయాణికులు ఈ మార్గంలో రైళ్లనే ఆశ్రయిస్తుంటారు.
పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల పరిధిలో నిత్యం 60 వేల మందికిపైగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇందులో ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణిస్తున్న మహిళలు 30 వేల మందికిపైగా ఉంటారని అంచనా. ప్రస్తుతం జిల్లాలో సూపర్ లగ్జరీ 10, అల్ట్రా డీలక్స్ 54, ఎక్స్ ప్రెస్ సర్వీసులు 45, అల్ట్రా పల్లె వెలుగు 33, పల్లె వెలుగు 203 బస్సులు చొప్పున ఉన్నాయి. పథకం అమలు కోసం 200 వరకూ సర్వీసులను కేటాయించినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మారుమూల గ్రామాలకు వెళ్లే వాటిలో కాలం చెల్లిన బస్సులే అధికం. ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగితే.. వీటి సామర్థ్యం సరిపోతుందా? అని ఉద్యోగులు సంశయిస్తున్నారు.
న్యూస్‌రీల్
ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ
పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, విజయనగరం మార్గాల్లో నిత్యం వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. నిల్చొని ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. కొన్ని మార్గాల్లో చాలా సమయం వేచి చూస్తేనే గానీ.. బస్సు ఎక్కలేని, సీటు దొరకని సందర్భాలు ఉంటాయి. ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక ఈ పరిస్థితి మరింత అధికంగా ఉంటుంది. దీనివల్ల టికెట్ తీసుకుని ప్రయాణించే సామాన్య ప్రయాణికులకు బస్సులు అందుబాటులో ఉండటం కష్టమే. అదనపు సర్వీసులను నడిపితేనే గానీ.. రద్దీని నియంత్రించలేమని ఉద్యోగులు అంటున్నారు.
కొన్ని సర్వీసులకే అవకాశం
అదనపు బస్సులు నడపకుంటే కష్టమే..

ఆల్బెండజోల్ మాత్రలను తప్పక తీసుకోవాలి

ఆల్బెండజోల్ మాత్రలను తప్పక తీసుకోవాలి

ఆల్బెండజోల్ మాత్రలను తప్పక తీసుకోవాలి