పాముకాటుతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

Aug 13 2025 4:56 AM | Updated on Aug 13 2025 5:38 AM

చీపురుపల్లి రూరల్‌(గరివిడి): గరివిడి పట్టణంలోని బీపీ(బద్రీప్రసాద్‌)కాలనీకి చెందిన వరదా సత్యవతి(65) పాము కాటుతో మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు సత్యవతి ఆదివారం రాత్రి ఇంటిలో మంచంపై పడుకున్న సమయంలో పాటు కాటు వేసింది. విషయం తెలుసుకున్న వెంటనే బాధితురాలిని చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి కుటుంబసభ్యులు తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నామని ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపారు.

గంజాయి కేసులో

నిందితులకు రెండేళ్లు జైలు

విజయనగరం క్రైమ్‌: విజయనగరం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో 2024లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు ముద్దాయిలకు రెండేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటవ ఏడీజే జడ్జి ఎం.మీనాదేవి తీర్పు వెల్ల డించారని ఎస్పీ వకుల్‌ జిందల్‌ సోమవారం తెలిపారు. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..విజయనగరం టూటౌన్‌ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు గతేడాది ఆగస్టు 25న స్టేషన్‌ పరిధిలోని శ్రీనివాసనగర్‌లో కోమటి చెరువు వద్ద ఇద్దరు వ్యక్తులు ఉమ్మంది ఎల్లయ్య (26) యూసఫ్‌ (25) పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వారిని పట్టుకుని వారి నుంచి 3.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్‌ సీఐ టి.శ్రీనివాస రావు రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌లో నిందితులపై నేరారోపణలు రుజువుకావడంతో ముద్దాయిలకు పై విధంగా శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు.

గేదెను ఢీకొట్టి యువకుడి మృతి

విజయనగరం క్రైమ్‌: విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గొట్లాం హైవేపై ఆదివారం రాత్రి కెరటాం గ్రామానికి చెందిన బర్ల సాయి(21) అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్సై అశోక్‌ కుమార్‌ సోమవారం తెలిపారు. సాయి తన పల్సర్‌ బైక్‌పై గొట్లాం హైవే మీదుగా వెళ్తుండగా గుంకలాం చెరువు వద్ద ఆకస్మాత్తుగా గేదె అడ్డు రావడంతో బైక్‌ను అదుపు చేయలేక గేదెను ఢీ కొట్టాడు. బైక్‌పై ఉన్న బర్ల సాయి కిందపడడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రూరల్‌ ఎస్సై ఆశోక్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.

ప్రైవేట్‌ కళాశాల బస్సు,

ఆర్‌టీసీ బస్సు ఢీ

8 మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలు

విషమంగా ఒకరి పరిస్థితి

కొత్తవలస: మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారిలో చింతలపాలెం జంక్షన్‌ సమీపంలో ఎదురు ఎదురుగా వస్తున్న పైవేట్‌ కళాశాల బస్సు, ఆర్‌టీసీ బస్సు ఢీకొనడంతో 8 మంది విద్యార్థినులు గాయాల పాలయ్యారు. వారిలో ఒక విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ నుంచి విశాఖపట్నం ఎండాడ ఐటీ సెక్టార్‌కు వెళ్తున్న సింహాచలం డిపోకు చెందిన ఆర్‌టీసీ బస్సు లక్కవరపుకోట మండలం కొట్యాడ గ్రామం సమీపంలో గల బెహరా పాల్‌టెక్నిక్‌ కళాశాలకు చెందిన బస్సు పెందుర్తి నుంచి విద్యార్థులు, బోధన సిబ్బందిని ఎక్కించుకుని తీసుకొస్తుండగా ఎదురెదు రుగా ఢీకొన్నాయి. దీంతో జరిగిన ఈ ప్రమాదంలో బెహరా కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థినులు గాయాల పాలయ్యారు. వారిని వెంటనే గోపాలపట్నం సమీపంలో గల బెహరా ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. కాగా గాయ పడిని వారిలో విద్యార్థిని కృతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమదం వార్త తెలుసుకున్న కొత్తవలస పోలీస్‌లు రెండు బస్సులను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పాముకాటుతో మహిళ మృతి1
1/2

పాముకాటుతో మహిళ మృతి

పాముకాటుతో మహిళ మృతి2
2/2

పాముకాటుతో మహిళ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement