
చీడిమానుగూడలో వైద్యశిబిరం
సీతంపేట: మండలంలోని చీడిమానుగూడలో సోమవారం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సవర ఓబిగోల్‌కు వైద్యసేవలు అందించారు. ‘తప్పనిడోలీ కష్టాలు’ శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. మర్రిపాడు పీహెచ్‌సీ వైద్యాధికారి సత్యవేణి, మలేరియా సబ్‌యూనిట్ ఆఫీసర్ జె.మోహన్‌రావు ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఐఆర్‌ఎస్ 5 శాతం ఏసీఎం ద్రావణాన్ని పిచికారీ చేయించారు. రోగులకు మందులు అందజేశారు. అత్యవసర సమయంలో వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నామని, గ్రామానికి సీహెచ్‌డబ్ల్యూను నియమించాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ సావిత్రి, హెల్త్ అసిస్టెంట్‌లు తోటయ్య, మహింద్ర తదితరులు పాల్గొన్నారు.

చీడిమానుగూడలో వైద్యశిబిరం