
‘హర్‌ఘర్ తిరంగా’ను విజయవంతం చేయాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో హర్‌ఘర్ తిరంగా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ నుంచి జిల్లా, మండలస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌లో సోమవారం మాట్లాడారు. వివిధ రకాల పోటీలు, ర్యాలీలు, మానవహారాలు, జాతీయ జెండా ప్రదర్శనలను హర్‌ఘర్ తిరంగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
నేడు డీవార్మింగ్ డే
డీవార్మింగ్ డేను సంబంధిత అధికారుల పర్యవేక్షణలో నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు భోజనం అనంతరం నిర్దేశించిన మోతాదులో ఆల్బెండ్‌జోల్ మాత్రను నమిలి మింగించాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ ఎస్.ఎస్.శోభిక, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీపీఓ కొండలరావు, ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ, జిల్లా ప్రణాళిక అధికారి పట్నాయక్, విద్యుత్ కార్యనిర్వహణ ఇంజినీర్ వేణుగోపాలనాయుడు, డివిజనల్ అభివృద్ధి అధికారి రమేష్‌రామన్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్