
అర్జీదారుల ఆకలి తీరుతోంది
పార్వతీపురం రూరల్: కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చి తమ సమస్యల పరిష్కారానికి సొంత గ్రామాల్లో ఉదయం బయలు దేరి 10గంటల సమయానికి కలెక్టరేట్‌కు అర్జీదారులు చేరుకుంటారు. అయితే చార్జీలు భరించి వ్యయ ప్రయాసాలతో సామాన్యులు, దివ్యాంగులు తమ సమస్య పరిష్కారం కావాలనే ఆశతో వచ్చిన వారికి అర్జీలు అందజేసిన అనంతరం ఉచితంగా కలెక్టరేట్ ఆవరణలో భోజనం చేసేందుకు ఇటీవల కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ ఆలోచన మేరకు భోజన సదుయాపం కల్పించారు. ఎంతోమంది అర్జీదారులు ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. ఇంతమంచి ఆలోచన చేసిన కలెక్టర్‌కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు 44 మంది ఎంపిక
విజయనగరం అర్బన్: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు జిల్లాలోని 44 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.శశిభూషణరావు తెలిపారు. స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ –2025 పోటీల్లో పాల్గొన్న 100 మంది నుంచి ఈ ఎంపిక జరిగిందన్నారు. ఈ పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన 44 మంది త్వరలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందారన్నారు. విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. న్యాయనిర్ణేతలుగా జుట్టాడ ప్రీతి, ఎ.నారాయణ, రమేష్, హర్ష, భాస్కర్, కరుణ వ్యవహరించారు.

అర్జీదారుల ఆకలి తీరుతోంది