
అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో ప్రతిభ
పాచిపెంట: ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చీరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ 2025 అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో పాచిపెంట మండల కేంద్రానికి చెందిన యువత ప్రతిభ కనబరిచారు. 10000, 5000 మీటర్ల పరుగు పందెంలో బొడ్డు సాయి మొదటి స్థానం సాధించగా, వాడాడ సతీష్ ద్వితీయ స్థానం సాధించాడు. 3000, 1500 మీటర్ల పరుగు పందెంలో ముల్లు హరీష్ మొదటి స్థానం సాధించాడు, అలాగే 5000 మీటర్ల రేస్‌వాక్ లో బుగత హరీష్ రెండవ స్థానం సాధించగా అండర్ 18 బాలికల విభాగంలో..ఉత్తరావల్లి మహాలక్ష్మి 1000 మీటర్ల పరుగు పందెంలో మూడవ స్థానం సాధించింది. మొత్తంగా..6బంగారు, 2రజత, 1కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా విజేతలకు కోచ్ నేతేటి శేఖర్‌తో పాటు పలువురు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు.