
● తప్పని డోలీ కష్టాలు..!
ఈ చిత్రంలో డోలీలో మోస్తున్న బాలిక పేరు సవర ఒబిగోల్. ఈమెది కొండాడ పంచాయతీ పరిధి చీడిమానుగూడ గ్రామం. కొద్ది రోజులుగా టైఫాయిడ్, మలేరియా, కడుపు నొప్పితో బాధపడుతుండగా గ్రామం నుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేదు. రోడ్డుపై రాళ్లు తేలడంతో 108 అంబులెన్స్ కూడా గ్రామానికి రావడం లేదు. దీంతో చేసేదేమీ లేక చీడిమానుగూడ నుంచి కొండాడ వరకు బాలికను ఇలా శనివారం మధ్యాహ్నం మూడు కిలోమీటర్ల దూరం మేర డోలీలో మోసుకుంటూ వచ్చారు. అక్కడ నుంచి ఆటోలో పాలకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. – సీతంపేట