
బాల్‌బ్యాడ్మింటన్ సెలక్షన్‌కు స్పందన కరువు
లక్కవరపుకోట: మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్‌లో బాల్‌బాడ్మింటన్ జిల్లా జట్టుకు సంబంధించి 10వ సబ్ జూనియర్స్, 11వ సీనియర్ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలకు క్రీడాకారుల నుంచి స్పందన కరువైంది. ఈ ఎంపికలకు క్రీడాకారులు అనుకున్న మొత్తంలో రాకపోవడంతో వచ్చిన వారిని తప్పని పరిస్థితిలో జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కాగా ఈ ఎంపిక పోటీలను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలతోనే ఉజ్వలభవిష్యత్ ఉంటుందన్నారు. అనంతరం జిల్లా బాల్‌బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.శ్రీనివాస్‌రావు, కార్యదర్శి జి.లక్ష్మణరావులు మాట్లాడుతూ నేడు ఎంపిక చేసిన క్రీడాకారులు ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లా చెవ్వూరులో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా ఎంపికకు వచ్చిన అతి కొద్ది మంది క్రీడాకారులకు సైతం నిర్వాహకులు కనీసం భోజనం, మంచినీటిసౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. తూతూమంత్రంగా ఎంపికలను నిర్వహించి మమ అనిపించారు.కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గాడి రవికుమార్, జి.సింహాచలం,ఎస్.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.
తప్పని పరిస్థితిలో సెలక్షన్‌కు వచ్చిన వారి ఎంపిక