
10 మంది జూదరుల అరెస్టు
● రూ 42,300 నగదు స్వాదీనం
● 6 ద్విచక్రవాహనాలు సీజ్
లక్కవరపుకోట: మండలంలోని తామరాపల్లి గ్రామం శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కాయిన్ ఆటపై ఎస్సై నవీన్‌పడాల్ తన సిబ్బందితో ఆదివారం సాయంత్రం దాడి చేశారు. కాయిన్ ఆట ఆడుతున్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ 42,300 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అలాగే జూదరులకు సంబంధించిన 6 ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే శక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పట్టుబడితే ఎంతటి వారైనా శిక్ష తప్పదని ఎస్సై హెచ్ఛరించారు.కార్యక్రమంలో హెచ్‌సీ పాపారావు, కానిస్టేబుల్స్ గౌరినాయుడు తదితరులు పాల్గొన్నారు.
కోడి పందాల రాయుళ్లు..
బొండపల్లి: మండలం లోని కొత్త పాలెం గ్రామం పరిధిలో ఆదివారం కోడిపందాలు ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. పందెంలో పాల్గొన్న ఏడుగురితో పాటు, 5పందెం కోళ్లు, రూ.7,140 నగదు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.