
అర్జీల వివరాల కోసం టోల్ ఫ్రీ 1100 : కలెక్టర్
పార్వతీపురం రూరల్: పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీల వివరాలను టోల్ ఫ్రీ 1100 నంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చ ని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొనేందుకు మీకోసం వెబ్ సైట్ (మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్)లోనూ సమస్యలపై ప్రజలు అర్జీలు నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సమస్యలపై ప్రతీ సోమవారం వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ రోజు ప్రజల వినతులు స్వీకరించడానికి సెల్లార్‌లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామని తెలిపారు.
నేడు ఐటీడీఏలో పీజీఆర్‌ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ఐటీడీఏ పీవో సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు ఇవ్వవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి.
రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో శిక్షణ
చీపురుపల్లి: ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో బేసిక్ ఫస్ట్ ఎయిడ్‌పై నిష్ణాతులైన వారితో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ రెవెన్యూ డివిజినల్ కోఆర్డినేటర్ బివి.గోవిందరాజులు చెప్పారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న రెడ్‌క్రాస్ సంస్థకు చెందిన బ్లడ్ బ్యాంక్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికీ చివరి క్షణాల్లో గోల్డెన్ పీరియడ్ ఉంటుందని ఆ సమయంలో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అందించడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకా శం ఉంటుందన్నారు. అలాంటి బేసిక్ ఫస్ట్ ఎయిడ్‌పై వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. దీని కోసం రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా చైర్మ న్ కెఆర్‌డి.ప్రసాద్ ఆదేశాల మేరకు అబోతుల రమణ అనే నిష్ణాతులైన ఉద్యోగిని నియమించినట్టు తెలిపారు. రమణ ఆధ్వర్యంలో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఎవరైనా మృతి చెందినప్పుడు నేత్ర దానం, అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తే తక్షణమే రెడ్‌క్రాస్ 89192 649 93, 9247818604 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. అవయవ దానం చేయడం ద్వారా వారికి సంపూర్ణ జీవితం ఇచ్చిన వారవుతారని పేర్కొన్నారు.

అర్జీల వివరాల కోసం టోల్ ఫ్రీ 1100 : కలెక్టర్