
వ్యక్తి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్ : మండలంలోని జమ్ములో నివాసముంటున్న కొమ్మురు పార్వతీశ్వరరావు(32) తన ఇంట్లోనే బ్లేడ్‌తో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి విజయనగరం రూరల్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ శనివారం తెలిపిన వివరాలు.. భోగాపురానికి చెందిన పార్వతీశ్వరరావు అదే గ్రామానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. జమ్ములో ఉంటున్న పార్వతీశ్వరరావు భార్య వద్దే రూ.14లక్షలు తీసుకున్నాడు. అడిగితే ఇదిగో.. అదిగో అంటూ దాట వేయసాగాడు. ఈసారి డబ్బులు అడిగితే చనిపోతానని బెదిరించేవాడు. అయినా మళ్లీ భార్య డబ్బులు అడగ్గా కోపంతో రగిలిపోయిన పార్వతీశ్వరరావు తన భార్య, తల్లిని గదిలో బంధించి బయట గడియపెట్టి బ్లేడ్‌తో మెడపై కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్‌ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.