
సకల భాషలకు తల్లి సంస్కృతం
విజయనగరం టౌన్: సకల భాషలకు మూలం, తల్లి వంటిది సంస్కృత భాష అని వాగ్దేవి సమారాధనమ్ సంస్థ వ్యవస్థాపకురాలు, రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెన్నేటి స్వప్నహైందవి అన్నారు. సంస్కృత భాషా దినోత్సవం పురస్కరించుకుని, నగరంలోని మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాలలో సంస్కృత భాషా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కర్రి సంతోషిలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ ఎన్.సూర్యనారాయణ, డాక్టర్ గోటేటి హిమబిందులు మాట్లాడుతూ నేడు మానవులు మాట్లాడుతున్నటు వంటి భాషాపదాల్లో 80 శాతం సంస్కృత పదాలేనని తెలిపారు. సంస్కృతం లేకుంటే మానవ జీవన గమనం కష్టమని రామాయణం, మహాభారతం, భాగవతాలు కూడా తొలుత సంస్కృతంలోనే లభ్యమయ్యాయన్నారు.