
వట్టిగెడ్డ నీరు విడుదల
జియ్యమ్మవలస: మండలంలోని రావాడ వట్టిగెడ్డ నీటిని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం విడుదల చేశారు. నీటిని విడుదల చేయడంతో వ్యవసాయ పంపుసెట్లు లేని రైతులు ఆనందిస్తున్నారు. ఉభాలు చాలా గ్రామాలలో ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఆదివారం నుంచి ఉభాలు అవుతాయని రైతు లు అంటున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బొంగు సురేష్, నీటి సంఘం అధ్యక్షులు ఎం. సత్యంనాయుడు, నాయకులు డొంకాడ రామకృష్ణ, జోగి భుజంగరావు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాఽధికారిత అధికారి టి.విమలారాణి శనివారం తెలిపారు. విద్యా, విజ్ఞానం, కళలు, ఆటలు ఇతర రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు దీనికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐదు సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు వారు తాము సాధించిన వాటికి సంబంధించిన సర్టిఫికెట్లు, పత్రికల్లో ప్రచురింపబడిన క్లిప్పింగ్‌లు తదితర వాటితో అవార్డ్.జిఓవి.ఇన్ వెబ్‌సైట్‌లో అన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎట్టకేలకు చిక్కిన నిందితుడు!
కొత్తవలస : మండలంలోని ముసిరాం గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావును తన మేనకోడల భర్తయిన అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం పాతవలస గ్రామానికి చెందిన సిమ్మ అప్పారావు ఈ నెల 5న నాటు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. కాగా నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు కశింకోట సమీపంలో పోలీసులకు శనివారం చిక్కినట్టు సమాచారం హత్య జరిగిన మరుసటి రోజు నుంచి అప్పారావు మకాం మార్చుతూ రాజమండ్రి, భద్రాచలం తదితర ప్రాంతాల్లో పోలీసుల నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. నిందితుడు తన ఫోన్‌ను ఘటనా స్థలంలోనే వదిలేసి వెళ్లిపోయాడు. అయితే పాతవలస గ్రామంలోని తన ప్రియురాలికి నిందితుడు తరచూ ఫోన్ చేస్తుండడంతో ఆమె ఫోన్‌పై పోలీసులు నిఘా పెట్టారు. సంబంధిత సిగ్నల్ ఆధారంగా నిందితుడు కదలికలను పోలీసులు గుర్తించారు. చివరికి అనకాపల్లి జిల్లా కశింకోట సమీపంలో శనివారం ఉదయం టిఫిన్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఆదివారం కోర్టును హాజరు పర్చనున్నట్టు తెలిసింది.
మరణించి..
మరో ఇద్దరికి వెలుగునిచ్చి..
పెందుర్తి : అనారోగ్యంతో మరణించిన వృద్ధురాలి నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకుంది ఓ కుటుంబం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తాడివానిపాలెం అంబేడ్కర్‌కాలనీకి చెందిన రాజాన అచ్చియ్యమ్మ(90) ఆరోగ్యం క్షీణించి శనివారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో పెందుర్తికి చెందిన సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి దాడి శ్రీనివాస్, స్థానిక పెద్ద ఎం.సింహాచలం మృతురాలి కుటుంబ సభ్యులను నేత్రదానానికి ఒప్పించారు. కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వెంటనే అక్కడకు చేరుకున్న ఎల్‌వీ ప్రసాద్ సారధ్యంలోని మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు అచ్చియ్యమ్మ నేత్రాలను సేకరించి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు.
స్వామి ఆలయంలో
ప్రత్యేక పూజలు
జామి: వేంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం అయిన శ్రవణ నక్షత్రం, శ్రావణ పౌర్ణమి, శనివారం సందర్భంగా భీమసింగి సుగర్‌ఫ్యాక్టరీ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు వరప్రసాద్ ఆచార్యులు ఆద్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అలంకరణగావించి, విశిష్ట పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాద వితరణ గావించారు. అన్నంరాజుపేట పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు గావించారు.

వట్టిగెడ్డ నీరు విడుదల

వట్టిగెడ్డ నీరు విడుదల