
పశువుల మాంసం వ్యాన్ సీజ్
బొండపల్లి: బొండపల్లి మండల కేంద్రం మీదుగా శనివారం ఉదయం మూడు టన్నుల పశువుల మాంసం లోడుతో అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను పట్టుకుని సీజ్ చేసినట్టు ఎస్‌ఐ మహేష్ తెలిపారు. ఈ మాంసం సాలూరు నుంచి రాజమండ్రికి అక్రమంగా తరలిస్తున్నట్టు తెలిపారు. వ్యాన్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించామని ఎస్‌ఐ పేర్కొన్నారు.
భక్తిశ్రద్ధలతో పైడితల్లి చండీయాగం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, భక్తుల పాలిట కల్పివల్లి శ్రీపైడితల్లిని ఆరాధిస్తూ స్థానిక రైల్వేస్టేషన్ దగ్గరున్న వనంగుడి, చదురుగుడి ఆవరణల్లో చండీయాగం శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి, రాజేష్, సాయిలు శాస్త్రోక్తంగా పూజలు చేసి, యాగంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలు, కండువాలు అందజేశారు.

పశువుల మాంసం వ్యాన్ సీజ్