
కూల్ డ్రింక్స్ వద్దు.. ఆరోగ్యమే ముద్దు
విజయనగరం గంటస్తంభం: కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని, ఆరోగ్యానికి హాని కలిగించే కూల్‌డ్రింక్స్ విడిచిపెట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముద్దని జనవిజ్ఞాన వేదిక జాతీయ కమిటీ కన్వీనర్ డాక్టర్ ఏవీ రాజశేఖర్ అన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో శనివారం క్విట్ కూల్ డ్రింక్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ.. కూల్ డ్రింక్స్‌లో కార్బన్‌డయాకై ్సడ్, ఆల్కహాల్, ఎరువులు తదితర ప్రమాదకరమైన పదార్ధాలు కలుపుతారని, ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయని అన్నారు. జేవీవీ జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్ మాట్లాడుతూ.. కోకో కోల, పెప్సీ వంటి విదేశీ కూల్ కూల్ డ్రింక్స్‌ను విడిచిపెట్టి మన ఆరోగ్యాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మన ఇంటికి వచ్చే బంధువులకు కూల్ డ్రింక్స్‌ను ఇవ్వకుండా దాని స్థానంలో మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరినీళ్లు వంటి పానీయాలను ఇవ్వాలని విజ్ఞాప్తి చేశారు. కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి షిణగం శివాజీ, గురజాడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూడి శేఖర్, ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.