3 | - | Sakshi
Sakshi News home page

3

Aug 10 2025 6:26 AM | Updated on Aug 10 2025 6:26 AM

3

3

కోట్లా..
రూ.
వెంకటేశా..!

అమ్మకానికి ఉద్యోగాలు..?

టీడీపీ నాయకులకు 30 శాతం కమీషన్‌

అమరావతి నుంచి కిందస్థాయి

అధికారుల వరకు కుమ్మక్కు?

బయట పడిన ఇద్దరు టీడీపీ నాయకుల ఆడియో సంభాషణ

పోస్టులు అమ్మేస్తే.. చదువుకునేవారికి

ఇంకెలా ఉద్యోగాలు వస్తాయంటూ నిరుద్యోగుల నిట్టూర్పు

సాక్షి, పార్వతీపురం మన్యం:

ఆమె: 3 సీఆర్‌ (రూ.3కోట్లు) రెడీగా ఉంది. ఎరేంజ్మెంట్‌ చేయమనండి. మన దగ్గర ఉండడం ప్రమాదం. నేను సాయంత్రం వారి దగ్గరికి వెళ్లి మీకు ఫోన్‌ చేస్తాను. మీరు మాట్లాడితే చాలు.

అతను: నేను ఏం మాట్లాడాలో చెప్పు... వారిని డబ్బులు పట్టుకుని ఉండమను.

ఆమె : ఏం మాట్లాడతారు.. పర్సంటేజీ. డబ్బులు మన దగ్గరే ఉన్నాయి.. 3 సీఆర్‌!

అతను: పర్సంటేజ్‌ 30 అని చెప్పాను.. వీరికి 15.. మనకు 15 ఉంటుంది.

ఆమె : రెండు, మూడు రోజుల్లో పార్వతీపురం నుంచి క్యాష్‌ పట్టుకెళ్లమనండి. మనం అయితే అంత పట్టుకెళ్లలేం. మీకు అర్థం కావడం లేదు.

ఆమె : ఇప్పుడే ఆమెకు ఫోన్‌ చేశాను. అమ్మా ఈ జాబ్‌ ఎవరు వేయిస్తున్నారని అడుగుతున్నారు. ‘సూపరింటెండెంట్‌ గారా.. వెంకటేష్‌ గారా.. నువ్వా..‘ అని అడిగారు. నేను సైలెంట్‌గా ఉన్నాను.

ఇదీ.. టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య ఫోన్‌ సంభాషణ. చిన్నచిన్న కాంట్రాక్టుల నుంచి ఉద్యోగాల వరకూ.. అవకాశం ఉన్న ఏ దారినీ వదలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు.. పలు ఉద్యోగాల భర్తీ విషయంలో రూ.3 కోట్లకు బేరం పెట్టినట్లు ఆ ఫోన్‌ సంభాషణలో స్పష్టంగా ఉంది. అవి ఏ పోస్టులు? ఇది ఎప్పుడు జరిగిందన్న విషయాలు వారి సంభాషణలో స్పష్టంగా తెలియనప్పటికీ.. అంత పెద్ద మొత్తంలో ఇచ్చే పోస్టులు ఏమై ఉంటుంది.. అన్నది తెలియాల్సి ఉంది. ఆ సంభాషణలో ఉన్న మహిళ గతంలోనూ పలువురిని మోసం చేసి, కేసులు ఎదుర్కోవడం గమనార్హం. పోస్టులను పార్వతీపురం మన్యం జిల్లాలోని యువకుడికి ఇప్పించడంలో ముగ్గురు వ్యక్తులు కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూపరింటెండెంట్‌.. వెంకటేశ్‌ అనే పేర్లను ప్రస్తావించగా... ఆ మొత్తం అందరికీ పంచాలని, అమరావతిలో పై స్థాయి నుంచి చేయించుకుని వచ్చామని మహిళతో మరో వ్యక్తి చెప్పడం విశేషం. సదరు యువకుడి తల్లి.. ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్లు అర్ధం అవుతోంది. ఆనుకున్న మొత్తం సర్దుబాటు కాలేదని, తర్వాత అందజేస్తానని సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి.. ఆ మహిళ (డబ్బులిచ్చే పార్టీ) అడిగితే ఏం చేద్దాం అని టీడీపీకి చెందిన మహిళ అనుమానం వ్యక్తం చేయగా.. ఇలాంటి విషయాలు ఫోన్లో అధికారులతో మాట్లాడవద్దని, వారికి ఇబ్బందులు ఉంటాయని చెప్పాలని రెండో వ్యక్తి బదులిచ్చాడు. లేకుంటే.. పోస్టుమన్‌కి చెప్పి ఆ లెటర్‌ (అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌) ఆపించేద్దామా? అని ఆమె అంటే.. వద్దని ఆయన తెలిపాడు.

అంగట్లో పోస్టులు

కూటమి ప్రభుత్వం హయాంలో పోస్టులన్నీ అంగట్లో వస్తువులుగా మారాయి. గతంలో అంగన్‌వాడీ వర్కర్‌ పోస్టును రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ విక్రయించుకున్నారని పలువురు బాధితులు పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రాలు అందించారు. రేషన్‌ డీలర్లు, విద్యుత్‌ శాఖలో కాంట్రాక్టు పోస్టులు, పలు విభాగాలలో తాత్కాలిక పోస్టులకు రేటు కట్టేసి.. తమ వారికి కట్టబెట్టారు. ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులు, చివరికి పాఠశాలల్లో భోజన పథక కార్మికులు, ఆయాలను సైతం వదలలేదు. ఉద్యోగుల బదిలీల్లోనూ ప్రజాప్రతినిధుల సిఫార్సులెటర్లకు సొమ్ము చేతులు మారిందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు ఏకంగా రూ.3 కోట్లకు ప్రభుత్వ ఉద్యోగాలను బేరం పెట్టారు అంటే.. అవి ఎంత పెద్దపోస్టులు? ఆ స్థాయిలో పోస్టులు అప్పనంగా ఎలా కట్టబెడుతున్నారు? అలాగైతే నిజాయితీగా ఏళ్లతరబడి ఉద్యోగాల కోసం రాత్రీపగలు చదువుతున్న నిరుద్యోగుల పరిస్థితి ఏమిటన్న వాదన వినిపిస్తోంది. పార్వతీపురం మన్యం వంటి మారుమూల ఉన్న జిల్లా నుంచి రూ.3కోట్ల తరలింపునకు, అది కూడా ట్రస్టులు, వ్యాపార సంస్థల పేరుమీద మళ్లించే మాస్టర్‌మైండ్‌ ఏర్పాట్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. విజిలెన్స్‌ అధికారులు దృష్టిసారిస్తే ఈ ఉద్యోగాల వెనుక ఉన్నవారు ఎవురు, వారి అవినీతి తంతు బయటపడుతుందని, ఉద్యోగాల అమ్మకానికి చెక్‌ పెట్టడంతో పాటు నిరుద్యోగులకు మేలు జరుగుతోందన్న అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది. అధికారబలానికి భయపడి ఈ అవినీతి తంతును విడిచిపెడతారా... లేదంటే నిజాయితీగా దర్యాప్తుచేసి అవినీతిపరులకు కళ్లెంవేస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement