
కూలిన ఆడలి వ్యూ పాయింట్ సైడ్ వాల్
సీతంపేట: నిత్యం సందర్శకులతో కళకళలాడే ఆడలి వ్యూపాయింట్ వద్ద సైడ్ వాల్ శుక్రవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కుప్పకూలింది. గోడ రాళ్లు, మట్టి క్యాంటీన్‌కు కొద్ది దూరంలో జారిపడ్డాయి. క్యాంటీన్‌లో నిదిరిస్తున్న యువకులు భయాందోళనతో పరుగుతీశారు. గోడరాళ్లు క్యాంటీన్‌పై పడితే ప్రమాదం జరిగి ఉండేదని చెబుతున్నారు. టికెట్లు ఇచ్చే గేటు నుంచి పైకి వెళ్లే మార్గంలో గోడ ఉంది. అక్కడ నుంచి మరికొద్ది దూరంలో కిందన క్యాంటీన్, ఇంకాస్త కిందన వ్యూపాయింట్ ఉంది. ప్రస్తుతం కూలినగోడ వద్ద నుంచి నిల్చుని చూస్తే వ్యూపాయింట్ కనిపిస్తుంది. అదృష్టవశాత్తు రాత్రి సమయం కావడం, పర్యాటకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరిగాయి. నాణ్యతలోపం వల్లే సైడ్‌వాల్ కూలిందని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆడలికి వెళ్లే మార్గంలో ద్విచక్రవాహనాలు, ఆటోలతో పలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
త్రుటిలో తప్పిన ప్రమాదం
భారీ వర్షానికి క్యాంటీన్‌పై జారిపడిన రాళ్లు
నాణ్యతాలోపమే కారణమా?

కూలిన ఆడలి వ్యూ పాయింట్ సైడ్ వాల్