
వీఆర్‌ఏల వేతనాలు పెంచాలి
● 18న ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ధర్నాకు పిలుపు
విజయనగరం గంటస్తంభం: వీఆర్‌ఏల వేతనాలు పెంచాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కె.గురుమూర్తి డిమాండ్ చేశారు. ఏన్‌పీఆర్ శ్రామిక భవన్ సీఐటీయూ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు బి.సూర్యనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్మి ఎ.జగన్మోహన్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత ఎనిమిదేళ్లుగా వీఆర్‌ఏలకు జీతాలు పెంచకపోవడం దారుణమన్నారు. వీఆర్‌ఏలను రెగ్యులర్ వీఆర్‌ఏలుగా గుర్తించాలని, అర్హులైన వారికి నాలుగో తరగతి ఉద్యోగులుగా పదోన్నతులు ఇవ్వాలని, జాబ్ చార్ట్‌లో లేని పనుల నుంచి వీఆర్‌ఏలను మినహాయించాలని, 010 జీఓ కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 18న ఉదయం 10 గంటలకు జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వీఆర్‌ఏ జిల్లా సంఘం నాయకులు రాంబాబు, రమణ, లక్ష్మణరావు, చంద్రరావు, రమణ, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.