
జెడ్పీ చైర్మన్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు
విజయనగరం: ఉమ్మడి విజయగనరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు నివాసంలో శనివారం రక్షాబంధన్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో జరిగిన వేడుకల్లో మజ్జి శ్రీనివాసరావు సోదరీమణులు ఎం.అమృతవల్లి, ఎ.రమాదేవి, బి.పద్మలు ఆయనకు రాఖీలు కట్టి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు సోదరీమణులను కానుకలు అందించి గౌరవించారు. ఆ భగవంతుని చల్లనిదీవెనెలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాక్షించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సతీమణి పుష్పాంజలి పాల్గొన్నారు.