
పాత గుణానపురంలో గజరాజులు
కొమరాడ: మండలంలోని పాతగుణానపురం పరిసరాల్లో తొమ్మిది ఏనుగుల గుంపు శుక్రవా రం సంచరించింది. కళ్లికోట, దుగ్గి, గుణానపు రం గ్రామాల్లో కూరగాయల పంటలుచేతికందే వేళ ఏనుగుల సంచారంతో పంట నష్టం జరు గుతోందంటూ రైతులు గగ్గోలుపెడుతున్నారు. గజరాజులు తరలించేందుకు ప్రభుత్వం చర్య లు తీసుకోవాలని కోరుతున్నారు. దుగ్గి, గుణానపురం, కళ్లికోట రోడ్డుపైకి ఏనుగులు వచ్చే అవకాశం ఉందని, రాత్రిపూట ఎవరూ ప్రయాణించరాదని అటవీశాఖ సిబ్బంది సూచించారు.
కొటియాలో పర్యటించిన
ఒడిశా డిప్యూటీ సీఎం
సాలూరు:
వివాదాస్పద ఆంధ్రా–ఒడిశా సరిహద్దు కొటియా గ్రామంలో ఒడిశా రాష్ట్ర డిప్యూటీ సీఎం, సీ్త్ర శిశు, టూరిజం శాఖల మంత్రి పార్వ తిపరిద శుక్రవారం పర్యటించారు. ప్రగతి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు. విద్య, గిరిజనాభివృద్ధి, తదితర అంశాలపై మాట్లాడారు. కార్యక్రమంలో ఒడిశా రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

పాత గుణానపురంలో గజరాజులు