
10న జిల్లా స్థాయి యోగా పోటీలు
విజయనగరం అర్బన్: జిల్లా స్థాయి యోగా పోటీలను ఈ నెల 10న స్థానిక మెసానిక్ టెంపుల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నామని విజయనగరం జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ మజ్జి శశిభూషణరావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. పోటీల షెడ్యూల్ బ్రోచర్‌ను ఆయన విడుదల చేశారు. జిల్లాలో ప్రతిభ చూపిన విజేతలు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికవుతారని పేర్కొన్నారు. పోటీలు 10 నియోజకవర్గాల్లో, 10 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళల కేటగిరిల్లో ఉంటాయని తెలిపారు. పోటీలు ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పోటీల పూర్తి వివరాల కోసం ఫోన్ 7702134568నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రకటన విడుదల చేసిన వారిలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వడ్లమాని నరసింహమూర్తి, కోశాధికారి పి.సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ డి.శివ తదితరులు ఉన్నారు.