అంబరాన్నంటిన సిరిమాను సంబరం | - | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన సిరిమాను సంబరం

Jun 4 2025 1:15 AM | Updated on Jun 4 2025 1:15 AM

అంబరా

అంబరాన్నంటిన సిరిమాను సంబరం

● వైభవంగా సాగిన ముగ్గురమ్మల జాతర ● వేడుకగా సాగిన ఇప్పల పోలమ్మ, ఎర్ర కంచెమ్మల సిరిమానుల తిరువీధి ● తరలివచ్చిన భక్తజనం ● ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

పార్వతీపురం టౌన్‌:

మంగళ వాయిద్యాలు.. భక్తుల జయజయ ధ్వానాలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. కళాకారుల వేషధారణల నడుమ ఇప్పలపోలమ్మ, ఎర్రకంచె మ్మ అమ్మవార్లు సిరిమానోత్సవం మంగళవారం సంబరంగా సాగింది. సిరిమాను పూజారుల రూపంలో వీధిల్లోకి తరలివచ్చిన అమ్మవార్లను తిలకించేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాకు చెందిన లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. వీరితో పార్వతీపురం పట్టణం జనసంద్రంగా మారింది. అమ్మవార్లను కనులారా వీక్షించిన భక్తులు జయజయధ్వానాలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. మహిళలు ఘటాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవా ర్లను పూజించారు. అమ్మవార్ల పూజార్లు జన్నిరామారావు, నక్క వాసుదేవరావులు అమ్మవారి దండకం చదివి సాయంత్రం 5 గంటల సమయంలో సిరిమానును అధిరోధించారు. అంజలి రథంపై పేడి వేషధారుల నాట్యం అనంతరం సిరిమాను తిరువీధి ప్రారంభమైంది. అమ్మవార్లను ఎమ్మెల్యేలు బోనెల విజయ చంద్ర, తోయక జగదీశ్వరి, నిమ్మక జయరాజు, తదితరులు దర్శించుకున్నారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

సిరిమాను సంబరం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించా యి. తప్పెటగుళ్లు, కోలాటం, అమ్మవార్ల వేషధార ణలు, కాంతారా, బళ్లు వేషాలు ఆకట్టుకున్నాయి.

450 మందితో పోలీస్‌ బందోబస్తు

పార్వతీపురం ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించారు. 40 సీసీ కెమెరాలు అమర్చి పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నుంచి ఉత్సవాన్ని పర్యవేక్షించారు. సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు జిల్లా కేంద్ర సరిహద్దుల్లో భారీ వాహనాలను నిలిపివేసి, అత్యవసర, కార్లు, ద్విచక్ర వాహనాలను బైపాస్‌ మార్గం గుండా మళ్లించారు. పోలీస్‌ బందో బస్తును ఎస్పీతో పాటు ఏఎస్పీ అంకిత సురాన, పట్టణ సీఐ కె.మురళీధర్‌, ఎస్‌బీ సీఐ పి.రంగనాథం, సీసీఎస్‌ సీఐ అప్పారావు పర్యవేక్షించారు.

అంబరాన్నంటిన సిరిమాను సంబరం 1
1/4

అంబరాన్నంటిన సిరిమాను సంబరం

అంబరాన్నంటిన సిరిమాను సంబరం 2
2/4

అంబరాన్నంటిన సిరిమాను సంబరం

అంబరాన్నంటిన సిరిమాను సంబరం 3
3/4

అంబరాన్నంటిన సిరిమాను సంబరం

అంబరాన్నంటిన సిరిమాను సంబరం 4
4/4

అంబరాన్నంటిన సిరిమాను సంబరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement