నలుగురు విద్యార్థులకు పచ్చకామెర్లు
● జిల్లా కేంద్రాస్పత్రిలో వైద్య సేవలు
పార్వతీపురం రూరల్: గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ము గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు పచ్చకామర్ల బారినపడి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరో తరగతి చదువుతున్న కడ్రక విద్యాసాగర్, బచ్చల ఇసంత్, ఏడో తరగతికి చెందిన పువ్వల ధాన్యాలు, గంట ఫిరోష్‌లు నాలుగు రోజులుగా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్నా వార్డెన్ పట్టించుకోవడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు హెచ్.సింహాచలం ఆరోపించారు. ఇటీవల పిట్స్ వ్యాధితో ఈ పాఠశాలకు చెందిన ఒక విద్యార్థి మృతి చెందిన ఘటన మరువక ముందే అధికారులు ఇలా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. విద్యా ర్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా వార్డెన్ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నేటి నుంచి అన్వేష సైన్స్ ఫెస్ట్
సీతంపేట: స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమపాఠశాల ఆవరణలో అన్వేష సైన్స్‌ఫెస్ట్‌ను ఈనెల 23, 24 తేదీల్లో జరగనుందని పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవర్ స్వప్నిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 53 గిరిజన విద్యాసంస్థలు పాల్గొంటాయన్నారు. విద్యార్థులు రూపొందించిన 277 ప్రాజెక్టులు, టీచర్లు తయారుచేసిన 36 ప్రాజెక్టుల ప్రదర్శనలో 469 మంది విద్యార్థులు, 150 మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని పేర్కొన్నారు.
వెంకటరాజపురంలో ఏనుగులు
జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం గ్రామంలో సోమవారం ఉదయం ఏనుగులు దర్శనమిచ్చాయి. అనంతరం బిత్రపాడు, బట్లభద్ర, బాసంగి గ్రామాల్లోని పంట పొలాల్లోకి జారుకున్నాయి. అధికారులు స్పందించి ఏనుగుల తరలింపు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
● బొబ్బిలిలో
అనసూయ సందడి
బొబ్బిలి పట్టణంలో సినీనటి అనసూయ సోమవారం సందడి చేశారు. ముందుగా ఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. అనంతరం షాపంతా కలియతిరిగారు. సరమైన ధరలకే వస్త్రాలను విక్రయించడం ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ ప్రత్యేకమని, వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సంక్రాంతి ఆఫర్లను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ కొన్ని చిత్రాల పాటలకు స్టెప్పులు వేసి సందడి చేశారు. అభిమానులతో కేరింతలు కొట్టించారు. కార్యక్రమంలో షాపింగ్‌మాల్ య జమానులు ప్రసాదరెడ్డి, కేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, తదితరులు పాల్గొన్నారు.
నలుగురు విద్యార్థులకు పచ్చకామెర్లు
నలుగురు విద్యార్థులకు పచ్చకామెర్లు


