పోలీసుల పాత్ర కీలకం
● విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి
● చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్‌లో పోలీస్ శిక్షణ ప్రారంభం
శాంతిభద్రతల
పరిరక్షణలో
డెంకాడ: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమైనదని విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి అన్నారు. నూతనంగా ఎంపికై న కానిస్టేబుళ్లకు చింతలవలస ఏపీఎస్పీ ఐదో బెటాలియన్‌లో సోమవారం శిక్షణ ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన తొలి పోలీస్ అధికారి కానిస్టేబుల్ అని అన్నారు. శిక్షణ కాలం ఎంతో విలువైనదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా శిక్షణలోని క్రమశిక్షణ దోహదపడుతుందన్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే భావన బలంగా ఉండాలన్నారు. చట్టం పట్ల గౌరవం, విధి నిర్వహణలో నిజాయితీ, సమయపాలన వంటి లక్షణాలు పోలీస్ జీవితంలో అత్యంత అవసరమని చెప్పారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలు భవిష్యత్‌లో ప్రజల శాంతి భధ్రతల పరిరక్షణకు ఉపయోగపడాలన్నారు. 9 నెలల పాటు శిక్షణ కొనసాగుతుందని, ఇక్కడకు శిక్షణకు వచ్చిన 187 మంది పోలీస్ అభ్యర్థులు సమర్థవంతంగా శిక్షణ పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్ రెడ్డి, ఒకటవ బెటాలియన్ కమాండెంట్ సీహెచ్‌వీఎస్ పద్మనాభరాజు, 16వ బెటాలియన్ కమాండెంట్ అరుణ్‌బోస్, పోలీస్ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల పాత్ర కీలకం


