ఇప్పల పోలమ్మకు కలెక్టర్‌ ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

ఇప్పల పోలమ్మకు కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

Jun 2 2025 12:16 AM | Updated on Jun 2 2025 12:16 AM

ఇప్పల

ఇప్పల పోలమ్మకు కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

పార్వతీపురం టౌన్‌: పార్వతీపురం పట్టణ ప్రజల ఇలవేల్పు ఇప్పల పోలమ్మ జాతర సందర్భంగా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అమ్మవారికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండగ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

నేటి నుంచి ఇంటర్‌ కళాశాలల పునఃప్రారంభం

విజయనగరం అర్బన్‌: జూనియర్‌ కళాశాలల కు వేసవి సెలవులు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ జూ నియర్‌ కళాశాలలు 18, కేజీబీవీలు 26, ఆదర్శ పాఠశాలలు 16 ఉన్నాయి. ద్వితీయ సంవత్సర విద్యార్థులు కళాశాలలకు హాజరు కావాలని ఆర్‌ఐఓ ఎస్‌.తవిటినాయుడు సూచించారు.

రేషన్‌ పంపిణీ పరిశీలన

విజయనగరం ఫోర్ట్‌: పట్టణంలోని కేఎల్‌పురంలో 281098 నంబర్‌ రేషన్‌ షాపును జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌ ఆదివారం పరిశీలించా రు. సరుకుల నిల్వపై ఆరా తీశారు. సరుకుల ను సకాలంలో పంపిణీ చేయాలని డీలర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయన వెంట డీఎస్‌వో మధుసూదన్‌రావు, సీఎస్‌డీటీ రామారావు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ

విజయనగరం అర్బన్‌: బోధన నైపుణ్యాలకు సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒక రోజు ఉచిత శిక్షణా తరగతులు స్థానిక యూత్‌ హాస్టల్‌లో ఆదివారం నిర్వహించారు. శిక్షకుడు విల్‌ 2 కెన్‌ డైరెక్టర్‌ రామేశ్వర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణలో జిల్లా వ్యాప్తంగా 150 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణలో స్పోకెన్‌ ఇంగ్లిష్‌ విద్యార్థులకు నేర్పించడంలో ఉపాధ్యాయులు తెలుసుకోవలసిన మెలకువలు వివరించారు. ఈ మెలకువలతో విద్యా ర్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సందర్భంగా శిక్షకుడు రామేశ్వర్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను పెంపొందించే ఇలాంటి శిక్షణలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని కోరారు. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులకు జ్ఞాపి కలు, శిక్షణ ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పోలీస్‌ శిక్షణ కళాశాల సీఐ మురళి, ఉపాధ్యాయులు సోమశేఖర్‌, రెడ్డి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం

శృంగవరపుకోట: పట్టణంలోని కేంబ్రిడ్జ్‌ నారాయణ స్కూల్‌లో నెల రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్‌ షటిల్‌ క్యాంప్‌ ముగింపు వేడుకలు చీఫ్‌ కోచ్‌ పి.శ్రీరాములు నేతృత్వంలో శనివారం రాత్రి నిర్వహించారు. ఎమ్మెల్సీ రఘురాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్‌ కోచ్‌ శ్రీరాములు మాట్లాడుతూ.. శిబిరం నిర్వహణకు రూ.1,80,000 లు ఖర్చు కాగా, రఘురాజు గారి మిత్రబృందం ఈ ఖర్చు మొత్తాన్ని భరించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడలతో మానసిక ఆనందంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ ఏర్పర్చుకోవచ్చన్నారు. దీన్ని గుర్తించి విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన 105 మంది క్రీడాకారులను, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, పట్టణ పెద్దలు హాజరయ్యారు.

ఇప్పల పోలమ్మకు   కలెక్టర్‌ ప్రత్యేక పూజలు 1
1/2

ఇప్పల పోలమ్మకు కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

ఇప్పల పోలమ్మకు   కలెక్టర్‌ ప్రత్యేక పూజలు 2
2/2

ఇప్పల పోలమ్మకు కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement