అక్రమంగా తరలిస్తున్న సిగరెట్లు స్వాధీనం
రామభద్రపురం: నకిలీ ఇన్వాయిస్‌లతో అక్రమంగా తరలిస్తున్న సిగరెట్లు, గిన్నెలు తోమే సబ్బులను విజయనగరం జిల్లా రామభద్రపురం వద్ద వాణిజ్యపన్నుల శాఖ స్వాధీనం చేసుకుంది. గుంటూరు ఎంబీ ఎంటర్‌ప్రైజెస్ పేరిట నకిలీ ఇన్వాయిస్ సృష్టించి బీహార్ నుంచి సరుకు రవాణా అవుతున్నట్టు విచారణలో తేలిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చీఫ్ టాక్స్ కమిషనర్ ఎ. బాబు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ.96 లక్షల విలువైన సిగరెట్లు, రూ.2.53 లక్షల డిష్‌వాష్‌లను సీజ్ చేశామన్నారు.


