లింగ నిర్ధారణ వెల్లడిస్తే క్రిమినల్ చర్యలు
విజయనగరం ఫోర్ట్: గర్బస్థ పిండ పరిస్థితి, వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించవలసిన యంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గర్బస్థ పిండ పక్రియ చట్టం 1994 అమలుపై నియమించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. పోగ్రామ్ అధికారులు స్కానింగ్ సెంటర్లను విధిగా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలోని ఫెర్టిలిటి కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డీఎల్‌వో డాక్టర్ కె.రాణి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అచ్చుతకుమారి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సూర్యనారాయణ, ఘోషాస్పత్రి గైనికాలజిస్టు డాక్టర్ జె.సుధ, పిల్లల వైద్యులు డాక్టర్ కిషోర్‌కుమార్, డీపీఆర్‌వో జానకమ్మ, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, డెమో వి.చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ జీవనరాణి


