ప్రజాస్వామ్యానికి విలువ ఏముంది?
● లోపాలను, తప్పులను ఎత్తి చూపడమే మీడియా విధి
● పత్రికా స్వేచ్ఛపై దాడి సమంజసం కాదు..
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ : ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి ఇంటి మీద దాడి చేయడం.. ప్రజాస్వామ్యంపైన, పత్రికా స్వేచ్ఛపైన దాడి చేయడమేనని... ఇది మంచి పరిణామం కాదని సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోపాలను, తప్పులను ఎత్తిచూపడం మీడియా విధి అని.. అభ్యంతరాలుంటే ఖండించాలే గానీ, ఇటువంటి సంస్కృతిని ఏ ఒక్కరూ హర్షించరని తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ..
ప్రజలపై దాడులు పెరుగుతాయి..
ప్రజాస్వామ్య దేశంలో ఇదే సంస్కృతి కొనసాగితే పాలకులకు కూడా భయం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. పాలకులు యథేచ్ఛగా ప్రజలపై దాడులకు పాల్పడతారని తెలిపారు. ఇంక దేనికీ భయపడరని.. తాము ఏం చేసినా చెల్లుతుందన్న ఉద్దేశంతో మరింతగా దాడులు పెరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు.
ప్రజాస్వామ్యవాదులంతా
ఖండించాల్సిందే..
‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్క సాక్షినే కాదు.. మొత్తం పత్రికా స్వేచ్ఛ మీద జరుగుతున్న దాడిని ప్రజాస్వామ్య వాదులంతా, పత్రికా స్వేచ్ఛను కోరుకునే వారంతా ఖండించాలి.
ఎం.కృష్ణమూర్తి
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న జర్నలిస్టులపై దాడులు, అక్రమ కేసులు వంటి విష సంస్కృతికి చెక్ పడాలి. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ హక్కులను కాలరాయడం సిగ్గు చేటు. ఎటువంటి నోటీసులూ లేకుండా సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలు చేయడం సరికాదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. నియంత హిట్లర్ రాజ్యాన్ని నడుపుతున్న చంద్రబాబు.. కలం స్వేచ్ఛపై కత్తి పెట్టడం... వాస్తవాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే మీడియా వారిపై అధికార దుర్వినియోగం సరైంది కాదు. సుపరిపాలన అంటే వాస్తవాలు చెప్పే వారి గొంతు నొక్కడం కాదు... – బి.రవికుమార్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
●
లోపాలు బయట ప్రపంచానికి తెలియకూడదనేనా?
పత్రికల మీద దాడి చేసి, భయపెట్టి తమ లోపాలను, తప్పులను బయట ప్రపంచానికి తెలియజేయకుండా ఉండాలన్న దురద్దేశమే దీని వెనుక ఉన్న ఆలోచనగా అర్థమవుతోందని కృష్ణమూర్తి అన్నారు. అభిప్రాయాలు తెలియజేయనీయకుండా చేస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యానికి విలువ ఏముంది?
ప్రజాస్వామ్యానికి విలువ ఏముంది?


