9న పార్వతీపురంలో జాబ్‌మేళా
● జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి
కె.సాయికృష్ణ చైతన్య
పార్వతీపురం టౌన్: పార్వతీపురం భాస్కర్ డిగ్రీ కళాశాలలో ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ చదువుకొని 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. ఆసక్తి కలిగిన యువతీయువకులు తమ వివరాలను హెచ్‌టీటీపీఎస్://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదుచేసుకుని, రిఫరెన్స్ నంబర్‌తోపాటు బయోడేటా, ఆధార్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్, జెరాక్స్, ఒక పాస్‌ఫొటోతో ఉదయం 9 గంటలకు డ్రైవ్ జరిగే ప్రదేశంలో హాజరుకావాలని కోరారు. ఇతర వివరాలకు సెల్: 91772 97528, 94947 77553 నంబర్లను సంప్రదించాలన్నారు.


