గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు

Dec 29 2025 8:46 AM | Updated on Dec 29 2025 8:46 AM

గిరిజ

గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు

గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు

కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి

గుమ్మలక్ష్మీపురంలో గిరిజనులతో కలిసి అడుగువేసిన కలెక్టర్‌

గుమ్మలక్ష్మీపురం: గిరిజనుల ఆచారం, సంస్కృతికి ‘కంది కొత్తలు’ పండుగ నిలువుటద్దంలా నిలుస్తోందని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని హెచ్‌గ్రౌండ్‌ వద్ద కంది కొత్తల పండగ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ గిరిజనుల ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల జీవన విధానం ప్రకృతితో ఎంతగా ముడిపడి ఉందో ఈ పండగ నిర్వహణను చూస్తే అర్థం అవుతోందన్నారు. తర తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం, ఐక్యతను, ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని నేటి తరానికి తెలియజేసేలా ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమని ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గిరిజనులతో కలిసి నృత్యాల్లో పాల్గొన్నారు. అంతేకాక డప్పు వాయించారు. కలెక్టర్‌ తమ మధ్యకు వచ్చి సామాన్యుడిలా వేడుకల్లో భాగస్వామ్యం అవడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు1
1/1

గిరిజనుల సంస్కృతికి నిలువుటద్దం కందికొత్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement