ఇద్దరు యువకుల దుర్మరణం
చెట్టును మారుతి వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం
హైవే పక్కకు దూసుకుపోయిన వాహనం
నుజ్జునుజ్జయిన వ్యాన్, మృతదేహాలు
జేసీబీతో బయటకు తీసిన పోలీసులు
విశాఖ జిల్లాకు చెందిన వారుగా
మృతుల గుర్తింపు
గజపతినగరం:
గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మారుతి వ్యాన్ చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యువకులు ఆదివారం దుర్మరణం చెందారు. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని కంచరపాలెం ప్రాంతానికి చెందిన పొట్నూరు వినయ్ కు మార్(35), ఎల్లాబిల్లి దినేష్(24)లు శనివారం సాయంత్రం బేకరీ ఐటమ్స్ తీసుకుని విశాఖపట్నం నుంచి ఒడిశాలోని రాయగడ వెళ్లి తిరిగి అదేవ్యాన్‌లో ఆదివారం విశాఖపట్నం వస్తుండగా గజపతినగరం రైల్వేస్టేషన్ దగ్గర వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. చెట్టును వ్యాన్ బలంగా ఢీకొట్టడంతో మృతదేహాలు వాహనంలో పోలిక లేకుండా పడి ఉన్నా యి. ప్రమాద సమాచారం అందుకున్న గజపతి నగరం ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు.
మృతదేహాలను, వ్యాన్‌ను పోలీసులు జేసీబీతో బయటకు తీసి శవపంచనామాకు తరలించారు. వినయ్ కుమార్‌కు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు, దినేష్‌కు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. మృతుడు దినేష్ తల్లి ఎల్లబిల్లి శంకరమ్మ పిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు ఎస్సై కె.కిరణ్‌కుమార్ నాయుడు తెలిపారు.
ఇద్దరు యువకుల దుర్మరణం


