జగనన్న పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. తొలి విడతలో చేపట్టిన నాడు – నేడు పనుల్లో కార్పొరేట్‌ను తలదన్నేలా సకల సదుపాయాలు కల్పించారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించారు. టాయిలెట్ల దగ్గర నుంచి తరగతి గదుల వరకు ఏ బడి చూసినా | - | Sakshi
Sakshi News home page

జగనన్న పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. తొలి విడతలో చేపట్టిన నాడు – నేడు పనుల్లో కార్పొరేట్‌ను తలదన్నేలా సకల సదుపాయాలు కల్పించారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపించారు. టాయిలెట్ల దగ్గర నుంచి తరగతి గదుల వరకు ఏ బడి చూసినా

May 5 2025 8:32 AM | Updated on May 5 2025 11:37 AM

జగనన్

జగనన్న పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపో

గత ప్రభుత్వంపై కక్షతోనే..

గత ప్రభుత్వంపై కక్షతోనే నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన పనులను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. గత ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా 535 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు రూ.144.51కోట్లను మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వం నిధుల విడుదల చేయడంలో చతికిలపడింది. నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీలు పనులు నిలిపివేశాయి.

పాఠశాలల నాడు – నేడు పనుల పూర్తిపై ప్రభుత్వంలో కొరవడిన స్పష్టత

నిధుల కొరతతో నిలిచిన పనులు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 486 పాఠశాలలకు రూ.130.14 కోట్లతో పనులు

కూటమి ప్రభుత్వంలో 535 పాఠశాలల్లో నిలిచిపోయిన పనులు

పార్వతీపురం టౌన్‌: మనబడి నాడు – నేడు 2.0 కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. గతంలో దాదాపు 50 శాతం పనులు శరవేగంగా పూర్తి చేశారు. తొలివిడత నాడు – నేడు కింద జిల్లాలో 486 పాఠశాలలకు రూ.130.14కోట్లతో కార్పొరేట్‌కు మించిన వసతులను ప్రభుత్వ పాఠశాలల్లో సమకూర్చారు. రెండో విడత నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా గతంలో జిల్లా వ్యాప్తంగా 535 ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు రూ.144.51కోట్లను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పాఠశాలల్లో పది రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు పూర్తి ప్రణాళికలు గతంలోనే చేపట్టారు. రెండో విడత నాడు – నేడు అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పాఠశాలల విద్యా శాఖాఽధికారులు ఆదేశించారు. అప్పటికే ఎన్నికల కోడ్‌ రావడంతో జిల్లాలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత నాడు – నేడు పనులు, పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తిగా గాలికొదిలేసింది. అభివృద్ధి పనులు సాగక అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక పాఠశాలల్లోని తరగతి గదులు నాడు – నేడు పనులపై ప్రభుత్వంలో స్పష్టత లేకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని రెండో విడత పాఠశాలల్లో చేపట్టిన పనులు అర్థాంతరంగా నిలిచిపోగా ఆయా పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. రానున్న విద్యా సంవత్సరానికి తరగతి గదుల పనులు పూర్తి చేసి వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

కూటమి ప్రభుత్వంలో నిరాశే...

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నా ఏ ఒక్క బడిలోనూ ప్రగతి పనులు ముండడుగు పడలేదు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మాటేమో..కానీ ఏడాదంతా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండో విడతలో పాఠశాలల్లో చేపట్టిన పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఆశ పడిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు నిరాశే మిగిలింది.

నిధులు విడుదలైన వెంటనే పనులు చేపడతాం

రెండవ విడత నాడు – నేడు పనులకు సంబంధించి నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్‌ఎంసీ కమిటీల ఆధ్వర్యంలో పనులు చేపడతాం. జిల్లాలో 535 పాఠశాలల్లో పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

– తేజేశ్వరరావు, సమగ్రశిక్ష ఏపీసీ,

పార్వతీపురం మన్యం

పార్వతీపురం కొండా వీధిలో నిలిచిపోయిన

ఎంపీపీఎస్‌ పాఠశాల పనులు

జగనన్న పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపో1
1/1

జగనన్న పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement