రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో మన్యం విద్యార్థుల ప్రతి
పార్వతీపురం టౌన్/వీరఘట్టం: రాష్ట్రస్థాయి సైన్‌న్స్ ఫెయిర్‌లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారని జిల్లా సైన్స్‌అధికారి లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విజ్ఞాన ప్రదర్శన పోటీ ల్లో జిల్లా నుంచి జాతీయ స్థాయికి ఒక ప్రాజెక్టు, సౌత్ ఇండియా స్థాయిలో రెండు ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. నర్సిపురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన గ్రామం ముస్తాబు–విజన్ ఫర్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ందన్నారు. ఇదే ప్రాజెక్టు సౌత్ ఇండి యా లెవెల్‌లో ఎంపికై నట్లు తెలిపారు. ఎంపీయూపీ మొట్టవలస విద్యార్థులు రూపొందించిన టెస్టులేష న్ ప్రాజెక్టు సౌత్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపి కై ందని వివరించారు. జాతీయస్థాయి పోటీలు మార్చినెలలో ఢిల్లీలో నిర్వహిస్తారని, సౌత్ ఇండి యా లెవెల్ పోటీలు జనవరి 19న హైదరాబాద్‌లో సాగుతాయని చెప్పారు. మన్యం జిల్లా విద్యార్థులను జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు అభినందించారు.
●వీరఘట్టం మండలలలోని ఎం.వి.పురం యూపీ పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయురాలు డి. సంతోషికుమారి రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్‌లో సత్తాచాటారు. ఆమె ప్రదర్శించిన ‘టెస్సలేషన్’ ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై ంది. ఆమెను పాఠశాల హెచ్‌ఎం వై.శ్రీనుబాబు, సర్పంచ్ పి.వెంకటరమ ణ, ఎంఈఓ ఆనందరావు, తహసీల్దార్ కామేశ్వరరా వు అభినందించారు. టెస్సలేషన్ ప్రాజెక్టు ఒక జ్యామితీయ కళ (జ్యామిట్రీ). దీని ఆధారంగా తక్కువ ఖర్చుతో అధునాతన హంగులతో బిల్డింగ్ కనస్ట్రక్షన్స్ చేయవచ్చు. వస్త్ర పరిశ్రమలో సరికొత్త డిజైన్లు రూపొందించవచ్చు. బ్రిక్స్, టైల్స్‌ను ఆకర్షణీయమైన డిజైన్లతో తయారు చేయవచ్చని సంతో షికుమారి తెలిపారు.
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో మన్యం విద్యార్థుల ప్రతి


