మాపై కనికరం లేదా బాబూ..!
పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వితంతువులు, వృద్ధులు 19 నెలలుగా ఓపెన్ కాని సైట్ జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 23 వేల మంది అర్హులు ఎదురుచూపు
ప్రస్తుతం జిల్లాలో 1.30 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. వీరికి ప్రతినెలా సుమారు రూ.60 కోట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే అర్హులకు పింఛన్లు మంజూరుచేస్తాం. భర్త చనిపోయిన వెంటనే ఆ స్థానంలో భార్యకు పింఛన్ అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప కొత్త పింఛన్లు మంజూరు చేసే వీలుండదు.
– ఎం.సుధారాణి, డీఆర్‌డీఏ పీడీ,
పార్వతీపురం మన్యం జిల్లా
వీరఘట్టం:
ఈమె పేరు గూల భవానీ. వీరఘట్టంలోని కొండవీధి కి చెందిన ఈమె భర్త రాము చనిపోయి రెండేళ్లవుతోంది. పింఛన్ కోసం గత ఏడాదిన్నరగా సచివాలయం, స్థానిక టీడీపీ నాయకుల చుట్టూ తిరుగుతోంది. భర్తకి వచ్చిన పింఛన్ ఇప్పించాలని వేడుకుంటున్నా ఫలితం లేదని వాపోతుంది. చేపలు అమ్ముకుని జీవనం సాగిస్తున్న తనకు వితంతు పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని విన్నవిస్తోంది.
కొత్త పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మంది అర్హులైన వారు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ అందించాలి. కూటమి ప్రభుత్వంలో చేతి వృత్తుల వారికి ఎటువంటి పథకాలు అందడం లేదు. సీఎం చంద్రబాబు స్పందించి ఎన్నికల హామీ నెరవేర్చాలి.
– విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే
మాపై కనికరం లేదా బాబూ..!
మాపై కనికరం లేదా బాబూ..!
మాపై కనికరం లేదా బాబూ..!


