వితంతువులను ఆదుకోవాలి
భర్తలు చనిపోయి వితంతువులుగా ఉన్న చాలా మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆడ బిడ్డలను ఆదుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అర్హులందరికీ ప్రభుత్వం నూతన పింఛన్లు అందజేయాలి. చేతివృత్తులు చేసుకొని వెనుకబడిన 50 ఏళ్ల నిండిన వారికి పింఛన్లు అందించాలి. గత ప్రభు త్వం వలే ప్రతి ఆరు నెలలకోసారి అర్హులకు పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. – జంపు కన్నతల్లి,
జెట్పీటీసీ సభ్యురాలు, వీరఘట్టం


