మర్యాదపూర్వక కలయిక
పార్వతీపురం: పార్వతీపురానికి వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్‌ను కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి, ఎస్పీ మాధవ్‌రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ ఉన్నారు. మానవేంద్రనాథ్‌రాయ్ గురువారం గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తరువాత గుమ్మలక్ష్మీపురం మండలంలో ని గొరడలో వావిలాల బాపూజీ స్మారక వ్యవసాయ విజ్ఞాన సమాచార కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
సీతంపేట: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు సూచించారు. సీతంపేట గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన అన్వేష ఫెస్ట్ ముగింపు, బహుమతి ప్రదానోత్సవంలో ఆయన మా ట్లాడారు. 53 గిరిజన విద్యాసంస్థల నుంచి 292 ప్రాజెక్టులు ప్రదర్శించడం గర్వించదగ్గ విషయమన్నారు. భవిష్యత్తులో గిరిజన విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించా రు. సైన్స్‌ఫెస్ట్‌లో సీనియర్, జూనియర్ విభాగా ల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 42 మంది విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముగ్గురు ఉపాధ్యాయులకు టీచర్ మోడల్స్‌ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫే ర్ డీడీ అన్నదొర, డిప్యూటీఈఓ జి.రామ్మోహన్‌రావు, ఏటీడబ్ల్యూఓలు మల్లిఖార్జునరావు, సూర్యం, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
మర్యాదపూర్వక కలయిక
మర్యాదపూర్వక కలయిక


