మాదక ద్రవ్యాల సమాచారం అందించాలి
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో మాదక ద్రవ్యాల సమాచారం 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు అందించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభిక అన్నారు. జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో బుధవారం ఎస్పీ మాధవ్ రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదక ద్రవ్యాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల సమాచారం ఎవరి దగ్గర ఏ రూపంలో ఉన్నా అందించాలని, మాదక ద్రవ్యాల నియంత్రణకు సహకరించాలని కోరారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
జిల్లాలో 394 ఈగల్ క్లబ్‌లు
ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో గంజాయి బారిన పడకుండా పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లకు మాదక ద్రవ్యాల కిట్లు అందజేశామని, శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 394 ఈగల్ క్లబ్‌లను పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షణ పక్కాగా చేస్తున్నట్లు పేర్కోన్నారు. వాహనాల తనిఖీ సమయంలో రవాణావాఖ అధికారులు అన్ని కోణాల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
నవోదయం 2.0 కింద అవగాహన
ఎకై ్సజ్ ఏఈఎస్ జీవన్ కిశోర్ మాట్లలాడుతూ నవోదయం 2.0 కింద జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర తనిఖీల్లో భాగంగా రాయగడ, కొరాపుట్ జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 137 గ్రామాలను సారా ప్రభావిత గ్రామాలుగా గుర్తించామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాంబాబు, ఇన్‌చార్జి డీఈఓ రమాజ్యోతి, జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారి ఇ.అప్పన్న, జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారి ఆశ, దివ్యాంగుల శాఖ ఎ.డి కవిత, రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక


