ఆ అధికారితో వేగలేం..!
విజయనగరం ఫోర్ట్: ఆ అధికారి అంటే ఐసీడీఎస్ ఉద్యోగులకు హడల్. టీడీపీ నేత అండతో ఉద్యోగులపై ఇష్టారాజ్యంగా రెచ్చిపోతుండం, పెద్దపెద్ద కేకలు వేయడం, చేతిలో ఏది ఉంటే దానిని వారిపై విసిరేస్తుండడంతో బెదిరిపోతున్నారు. ఉద్యోగం చేసేందుకు భయపడుతున్నారు. తాము కూడా ఉద్యోగులమన్న కనీసం జ్ఞానం లేని అధికారితో వేగలేకపోతున్నామంటూ తెలిసినవారి దగ్గర గోడు వెళ్లబోస్తున్నారు. అయితే, ఆయనకు అధికార పార్టీ నేత అండదండలు ఉండడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కూడా భయపడుతున్నారు.
ఐసీడీఎస్‌లో ఓ అధికారి వేధింపులతో హడిలిపోతున్న ఉద్యోగులు
టీడీపీ నేత అండతో రెచ్చిపోతున్న అధికారి
ఆయనకు నచ్చకుంటే గిరిజన
ప్రాంతాలకు బదిలీ
అధికారి వేధింపులు తట్టుకోలేక ఆస్పత్రిపాలైన ఓ మహిళా ఉద్యోగి


