ఆశలున్నాయ్.. ఆటే లేదు!
న్యూస్‌రీల్
జిల్లాలో క్రీడా ప్రతిభ అపారం
ప్రోత్సాహం శూన్యం
వెన్నుతట్టే వారు లేక,
జిల్లా దాటలేకపోతున్న క్రీడాకారులు
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
గరుగుబిల్లి: తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ గురువారం దర్శించారు. ప్రత్యేక పూజలు చేశా రు. ఆలయ అర్చకులు వీవీ అప్పలాచార్యులు, కార్యనిర్వాహణాధికారి బి.శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు ముందుగా ఆయనకు పూర్ణ కలశంతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం వేదాశీస్సులు, తీర్థ ప్రసా దాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఆలయ విశిష్టతను వివరించారు. స్వామివారిని దర్శించుకున్నవారిలో విజయనగరం జిల్లా జడ్జి ఎం.బబిత, పార్వతీపురం రెండవ అదన పు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు, టీటీడీఎస్ టీ సభ్యులు డి.పారినాయుడు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో నఖచిత్రకారుడు పల్ల పరిశినాయుడు హైకోర్టు జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసి తను వేసిన నఖచిత్రాయణం, చిత్ర సాహితీ పుస్తకాలను అందజేశారు.
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ అధికారుల సంఘం (ఏపీ ఎన్‌జీజీఓఎస్) జిల్లా నూతన కమిటీ ఎన్నికలు వచ్చేనెల 11వ తేదీన నిర్వహించనున్నట్టు సంఘ ఎన్నికల అధికారి ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎన్నికలకు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎన్‌జీజీఓఎస్ అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారిగా, అదే జిల్లా కార్యదర్శి కేపీవీఎన్‌బీ కృష్ణ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారని పేర్కొన్నా రు. అమరావతికి చెందిన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులు ఎన్నికల అబ్జర్వర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. విజయనగరం జిల్లా కమిటీలో సుమారు 6,001 మంది ఉద్యోగులు సభ్యులుగా ఉండగా ఈ ఎన్నికల్లో 283 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యదర్శి, కోశాధికారి, అసోసియేట్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, మహిళా వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, మహిళా వైస్ ప్రెసిడెంట్, మహిళా జాయింట్ సెక్రటరీతో పాటు మొత్తం 17 పోస్టులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లను స్వీకరిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం విజయనగరం ఏపీఎన్‌జీజీఓహోంలో జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలోని అన్ని తాలూకాల నుంచి ఎన్నికై న ఆఫీస్ బేరర్స్, డీసీ, డీఈసీ, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.
వంగర: ఇనాం భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పిన్నింటి రామారావు తెలిపారు. మండలంలోని మరువాడ పంచాయతీలోని సీతాదేవిపురంలో వివాదాస్పద ఇనాం భూములను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమయ్యారు. భూములకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు నివేదిస్తామని వెల్లడించారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
జిల్లాలో క్రీడా ప్రతిభకు కొదవ లేదు. సానబెడి తే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయవచ్చు. సరైన ప్రోత్సాహం లేకపోవడం క్రీడాకారులకు శాపంగా మారింది. గతంలో జిల్లాకు చెందిన గిరిజన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించా రు. ఇప్పుడు వారంతా తెరమరుగయ్యారు. అందు కు కారణం పేదరికం, వెన్నుతట్టి ప్రోత్సహించేవా రు కరువవడం.. వసతులు లేకపోవడంతో చాలా మంది క్రీడలకు దూరం అవుతున్నారు. మన క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో రాణించేలా శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో పాఠశాలల్లో క్రీడాభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఇటీవల ప్రకటించారు. 2030లో మన దేశ ఆతిథ్యంతో నిర్వహించబోయే కామన్వెల్త్ క్రీడల్లో మన్యం జిల్లా క్రీడాకారులు పతాకాన్ని ఎగురవేసేలా వారిని సిద్ధం చేస్తామని చెప్పారు. ఆయన ఆశయం మంచి దే అయినా.. ఆచరణే అనేక సవాళ్లతో కూడుకున్న ది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో క్రీడాకారుల కు, క్రీడాభివృద్ధికి తీసుకున్న చర్యలు శూన్యం. సరైన సౌకర్యాలు, మంచి పౌష్టికాహారం అందించ డం ఖర్చుతో ముడిపడి ఉంది. అందుకు నిధుల లేమి క్రీడాకారుల ఆశయాన్ని నీరుగార్చుతోందన్న వాదన వినిపిస్తోంది.
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం పెంచేందుకు ఈ నెల 12 నుంచి 14 వరకు పాఠశాల స్థాయి ఎంపికలు నిర్వహించారు. 15 నుంచి 17 వరకు జిల్లాస్థాయి పోటీలు చేపట్టారు. నైపుణ్యం ఆధారంగా వీరికి క్రీడా పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తామని చెబుతున్నారు. విలువిద్య, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాస్కెట్ బాల్, చదరంగం, క్రికెట్, హ్యాండ్ బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, స్విమ్మింగ్, తైక్వాండో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా, బీచ్ వాలీబాల్ ఫెన్సింగ్ పోటీల్లో క్రీడాకారులను సానబెట్టాలన్నది ఆలోచన. జిల్లాలో క్రీడల అభివృద్ధికి వనరులు, అవకాశం ఉన్న గుమ్మలక్ష్మీపురం, తోటపల్లి, సీతంపేట, సాలూరు కేంద్రా ల్లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. వాస్తవానికి కొన్నేళ్ల కిందటే పాచిపెంట మండలం తోణాం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను క్రీడా పాఠశాలగా తీర్చిదిద్దే ప్రయ త్నం చేశారు. అది ఫలితం ఇవ్వలేదు. పలువురు ఉపాధ్యాయులపై కేసులు నమోదయ్యే వరకు వెళ్లింది. ఆ తర్వాత రావాడ–రామభద్రపురంలో క్రీడా పాఠశాల, మైదానం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీని కోసం స్థానిక పీహెచ్‌సీ, ఆశ్రమ పాఠశాల మధ్యనున్న సుమారు 12 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అది కూడా ముందుకు సాగలేదు.
గతంలో పలుమార్లు ఇక్కడ జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలు, వేసవి క్రీడా శిబిరాలు సైతం నిర్వహించా రు. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉన్న క్రీడ విలువిద్య. మన్యంలోని గిరిజన విద్యార్థులు ఎక్కువగా ఈ ఆటపై ఆసక్తి చూపుతున్నారు. సరైన క్రీడా సామగ్రి లేకపోవడంతో జిల్లా స్థాయికే పరిమితం అవుతున్నారు. జిల్లాలో ఎనిమిది గిరిజన మండలాలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 30 వేల మంది వరకు విద్యార్థులు గిరిజన పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారు. వీరిలో వందల సంఖ్యలో విలువిద్య శిక్షణ తీసుకున్నారు. గతంలో జరిగిన పోటీల్లో అనేక మంది జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయికి కూడా కొందరు వెళ్లారు. కొన్నాళ్లుగా వారి నుంచి కూడా ఆసక్తి సన్నగిల్లింది. విలువిద్య పోటీలు మూడు విభాగాలలో ఉంటాయి. ఒక్కో రౌండుకు ఒక్కో రకమైన బౌ (విల్లు) వాడాలి. జిల్లా విద్యార్థులు స్తోమత లేక ఒక రకమైన బౌ మాత్రమే వాడడంతో రెండో రౌండ్లో సత్తా చాటలేక చతికలపడుతున్నారు.
●2022, 23, 24లో స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా ఆతిథ్యం ఇచ్చింది. పలు ప్రాంతాల నుంచి 600 మందికి పైగా వచ్చారు. జిల్లా నుంచి పదుల సంఖ్యలో పోటీ పడినా ఒక్కరే జాతీయ స్థాయికి అర్హత సాధించారు.
●గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరిట జిల్లాలో పెద్దఎత్తున క్రీడా పోటీలను నిర్వహించింది. జిల్లా లోని 350 గ్రామ, వార్డు సచివాలయాలు, 15 మండలాలు, 4 నియోజకవర్గాల స్థాయిలో నాలుగు దశల్లో క్రీడలు నిర్వహించారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి క్రీడలు ఆడించా రు. క్రీడల నిర్వహణకు సచివాలయానికి రూ.10 వే లు, మండలానికి రూ.25 వేలు, నియోజకవర్గానికి రూ.25 వేలు చొప్పున విడుదల చేశారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకున్నారు. తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ ఆలోచనకే స్వస్తి పలికింది.
ఏపీ పీఎస్‌ఏ నూతన
కార్యవర్గం ఎన్నిక
రాజాం సిటీ: ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ (ఏపీపీఎస్‌ఏ) నియోజకవర్గ స్థాయి నూత న కార్యవర్గాన్ని స్థానిక విద్యానికేతన్ పాఠశాలలో గురువారం ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా బెవర ఈశ్వరరావు, కార్యదర్శిగా నడికొప్పల తారకేశ్వరరావు, కోశాధికారిగా ఎం.కిషోర్, ఉపాధ్యక్షురాలిగా జె.రాజేశ్వరి, జాయింట్ సెక్రటరీగా పొట్టా అప్పలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని విజయనగరం అధ్యక్షుడు గట్టి పాపారావు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ టి.సింహాచలం, స్టేట్ కౌన్సిల్ కో–ఆర్డినేటర్ రామ్మోహన్, ఉత్తరాంధ్ర అధ్యక్షుడు ఈ.గణపతి పాల్గొన్నారు.
ఆశలున్నాయ్.. ఆటే లేదు!
ఆశలున్నాయ్.. ఆటే లేదు!
ఆశలున్నాయ్.. ఆటే లేదు!


