వేణుగోపాల స్వామివారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
బొబ్బిలి: పట్టణంలోని పురాతన దేవాలయమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ గురువారం దర్శించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన నుంచి తిరిగి వస్తూ ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ పురోహితులు, దేవదాయ శాఖ సిబ్బంది, ఎమ్మెల్యే, తదితరులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆయన చేతులమీదుగా అర్చకులు పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తి బబిత, న్యాయమూర్తి రోహిణీ రావు, రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి దామోదర రావు, ఏపీపీ గంటి శర్మ, సీఐలు కె.సతీష్‌కుమార్, సీహెచ్ నారాయణరావు, పలువురు న్యాయవాదులు ఉన్నారు.


