●గాడిదపాయిలో కందికొత్తల పండగ
సీతంపేట మండలం గాడిదపాయి గ్రామంలో గురువారం కందికొత్తల పండగను గిరిజన ఆచార, సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలో ఉన్న జాకరమ్మ దేవతకు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. చేతి‘కంది’న తొలి పంటతో చేసిన వంటకాలను నైవేద్యంగా సమర్పించారు. దేవతల ప్రతిరూపంగా ఛత్రమ్మ (నెమలి పించాలు)ను ఊరేగించారు. ఇంటింటికీ తీసుకెళ్లిన ఛత్రమ్మకు దూపదీప నైవేద్యాలతో పాటు కర్పూరహారతులు ఇచ్చారు. డప్పువాయిద్యాలతో ఆడ, మగ, చిన్నాపెద్దా తేడా లేకుండా నృత్యాలు చేశారు. ఐదురోజుల పండగలో చివరిరోజు దోనుబాయిలో గిరిజనులమంతా కలిసి పండగ చేసుకుంటామని, ఆ తర్వాత కందులతో తయారుచేసిన వంటకాలను భుజిస్తామని గాడిదపాయి వాసులు తెలిపారు.
– సీతంపేట
●గాడిదపాయిలో కందికొత్తల పండగ


