కొబ్బరిబొండాల వ్యాన్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

కొబ్బరిబొండాల వ్యాన్‌ బోల్తా

Apr 19 2025 9:36 AM | Updated on Apr 19 2025 9:36 AM

కొబ్బ

కొబ్బరిబొండాల వ్యాన్‌ బోల్తా

సీతానగరం: మండలంలోని అంటిపేట వద్ద కొబ్బరి బొండాల వ్యాన్‌ బోల్తా పడింది. అయితే అదృష్టవశాత్తు త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. దీనిపై అంటిపేట గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం మండలంలోని అంటిపేట మీదుగా పార్వతీపురం వెళ్తున్న కొబ్బరిబొండాల వ్యాన్‌ అంటిపేట గ్రామ శివారులో వ్యక్తిని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న పొలంగోతిలో పడింది. వ్యాన్‌ డ్రైవ్రర్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. వ్యాన్‌ ముందు వీల్స్‌ మట్టిలో కూరుకుపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు చెబుతున్నారు.

జేసీబీ, 3 ట్రాక్టర్లు సీజ్‌

బొండపల్లి: మండలంలోని వెదురువాడ పంచాయతీ పరిధి పాడిపేట గ్రామ సమీపంలో అక్రమంగా గ్రావెల్‌ మట్టిని తవ్వి వెదురువాడలోని జిరాయితీ భూమిలో వేస్తుండగా అందిన ఫిర్యాదు మేరకు 1 జేసీబీతో పాటు, మూడు ట్రాక్టర్లను సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ డోలా రాజేశ్వర్రావు తెలిపారు. ఈ సందర్భంగా జేసీబీ డ్రైవర్‌ శీల గణేష్‌తో పాటు తాడి పైడినాయుడు, శీల శ్రీను, యడ్ల గోపిలు గ్రావెల్‌ తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్‌ చేసి రూ.25 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. సీజ్‌ చేసిన వాహనాలను బొండపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఎస్సై యు.మహేషకు అప్పగించినట్లు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం జిల్లా గనుల శాఖ ఎ.డికి నివేదిక అందజేసినట్లు తెలిపారు.

పిడుగుపాటుతో ఆవు మృతి

సాలూరు రూరల్‌: మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం కురిసిన పిడుగుల వర్షంతో పిడుగుపాటుకు గురై గ్రామానికి చెందిన హరిశ్రీను ఆవు మృతి చెందింది. పొలంలో మేత మేస్తుండగా అకస్మాత్తుగా గాలి వర్షంతో పాటు పిడుగులు పడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన విషయంలో గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనుల అభ్యున్నతికి కమిషన్‌ కృషి

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు

విజయనగరం అర్బన్‌: గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎస్టీ కమిషన్‌ కృషి చేస్తోందని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు అన్నారు. షెడ్యూల్‌ ప్రాంతాల్లో భూములపై గిరిజనులకే హక్కులు దక్కేలా చర్యలు తీసుకోవాలని ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ సంస్థ ప్రతినిధులు పలువురు శుక్రవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం చేసిన చట్టాలు అమలయ్యేలా చూడాలని వారు కోరారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో గిరిజన భూసమస్యలను చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేస్తూ వారి సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కమిషన్‌ కృషి చేస్తోందన్నారు. గిరిజన ప్రాంతవాసుల సమస్యలు కమిషన్‌ దృష్టిలో ఉన్నాయని సంబంధిత చట్టాలు అమలు చేసేలా ప్రభుత్వాన్ని కమిషన్‌ కోరుతున్నట్లు చెప్పారు. చైర్మన్‌ను కలిసిన వారిలో అజయ్‌కుమార్‌, తిరుమల రావు, గోపాలరావు, చంద్రరావు తదితరులు ఉన్నారు.

కొబ్బరిబొండాల వ్యాన్‌ బోల్తా1
1/3

కొబ్బరిబొండాల వ్యాన్‌ బోల్తా

కొబ్బరిబొండాల వ్యాన్‌ బోల్తా2
2/3

కొబ్బరిబొండాల వ్యాన్‌ బోల్తా

కొబ్బరిబొండాల వ్యాన్‌ బోల్తా3
3/3

కొబ్బరిబొండాల వ్యాన్‌ బోల్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement