700 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం
గుమ్మలక్ష్మీపురం(కురుపాం)/జియ్యమ్మవలస రూరల్: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా కురుపాం ప్రొహిబిషన్/ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని జియ్యమ్మవలస మండలం గడసింగుపురం గ్రామపరిసరాల్లో సారా తయారీ స్థావరాలపై శుక్రవారం నిర్వహించిన దాడిలో 700 లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేసినట్లు కురుపాం ఎకై ్సజ్ సీఐ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా డీపీఈఓ ఆదేశాల మేరకు సీతానగరం ఎకై ్సజ్ స్టేషన్ సీఐ పద్మావతి, గజపతినగరం, బొబ్బిలి, కురుపాం ఎకై ్సజ్ స్టేషన్‌ల ఎస్సైలు నరేంద్రకుమార్, శ్రావణ్‌కుమార్, జె.రాజశేఖర్ తదితర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారన్నారు. ఆ స్థావరంలో సారా తయారీ కోసం పులియబెట్టేందుకు ఉపయోగించిన ప్లాస్టిక్ టబ్బులతో పాటు 10 లీటర్ల సారాను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేకాకుండా సారా తయారీ శిబిరం నిర్వహిస్తున్న వారితో పాటు ముడిసరుకులు సరఫరా చేసే కోసం దర్యాప్తు నిర్వహిస్తున్నామని, దర్యాప్తులో వాస్తవాలు తేలితే చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.
కొత్తవలసలో 200 లీటర్ల బెల్లం ఊట
కొత్తవలస: మండలంలోని రామలింగాపురం గ్రామం సమీపంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ జీఎస్.రాజశేఖర నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 200 లీటర్లు పులబెట్టిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలాగే 4 లీటర్ల సారాను పారబోశారు. పోలీసుల అలికిడిన గమనించిన తయారీదారులు అక్కడి నుంచి జారుకున్నారు. సారా తయారీ, రవాణా, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీఐ తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఎస్సై వీఎన్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
700 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం


