● మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి
పార్వతీపురం: జిల్లాలో ఖాళీగా ఉన్న 17 అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి డాక్టర్ టి.కనకదుర్గ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో పార్వతీపురం మున్సిపాల్టీ పరిధిలో రెండు సహాయక పోస్టులు, సాలూరు పరిధిలో మూడు సహాయక పోస్టులు, బలిజిపేట ప్రాజెక్టు పరిధిలో ఒక అంగన్వాడీ కార్యకర్త పోస్టు, మూడు సహాయక పోస్టులు, సీతానగరంలో రెండు సహాయక పోస్టులు, పాలకొండ డివిజన్లోని పాలకొండలో మూడు సహాయక పోస్టులు, భామిని ప్రాజెక్టు పరిధిలో రెండు సహాయక పోస్టులు, వీరఘట్టంలో ఒక సహాయక పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన వివాహిత మహిళా అభ్యర్థినులు ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. అంగన్వాడీ సహాయకులకు జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. ఎస్టీ కేంద్రాలకు ఎస్టీ కేటగిరీకి రోస్టర్లో రిజిస్టర్ కాబడిన పోస్టులకు 21ఏళ్లు నిండిన అభ్యర్థులు అర్హులని, లేదంటే 18 ఏళ్లు నిండిన వారిని పరిగణనలోకి తీసుకుంటామన్నారు.