ఎలిఫెంట్
జోన్..
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: కొన్నేళ్లుగా జిల్లాను వీడని ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపేందుకు అటవీ శాఖాధికారులు చర్యలకు ఉపక్రమించిన విషయం విదితమే. కుంకీ ఏనుగులను రప్పించే ప్రయత్నంతో పాటు.. సీతానగరం మండలంలోని గుచ్చిమి రిజర్వు ఫారెస్టు వద్ద సుమారు 1,100 ఎకరాల స్థలంలో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. సంరక్షణ కేంద్రం పనులు సైతం కొద్దిరోజులుగా జోరుగా సాగుతున్నాయి. సీతానగరం మండ లం అప్పయ్యపేట, రేపటి వలస, తామరకండి, జోగింపేట, గుచ్చిమి, తాన్న సీతారాంపురం చిన్నా రాయుడిపేట, పార్వతీపురం మండలం పులిగుమ్మి రెవెన్యూ ప్రాంతాల పరిధిలో విస్తరించి ఉన్న కొండ చుట్టూ దాదాపు పది కిలోమీటర్ల మేర కందకం తవ్వుతున్నారు. దీంతో పాటు.. సోలార్ ఫెన్సింగ్ పనులూ చేపడుతున్నారు. స్థాని క రైతులకు, ప్రజలకు కనీస సమాచారం ఇవ్వక.. గ్రామ సభలు నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే పనులు చేపడుతున్నారంటూ స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. పనులను నిలుపుదల చేయాలని కొద్దిరోజులుగా ఆందో ళనలు చేస్తున్నారు. ఏనుగుల జోన్‌ను పార్వతీపురం మన్యం జిల్లా నడిబొడ్డున ఉన్న సీతానగరం మండలంలో పెట్టడమంటే.. ఆ మండలాలు, జిల్లా ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడటమేనని చెబుతున్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
దశాబ్దాలుగా ఏనుగుల సమస్య
ఒడిశా నుంచి జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఏనుగులు దశాబ్దాలుగా ఇక్కడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇప్పటికే 13 మంది ఏనుగుల దాడిలోమృతి చెందగా.. కోట్లాది రూపాయల పంట, ఆస్తి నష్టం సంభవించింది. జిల్లాలో రెండు గుంపులుగా తిరుగుతున్న గజరాజులు.. ప్రతిరోజూ ఏదో చోట నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో వివిధ ప్రమాదాల వల్ల ఏనుగులూ మృత్యువాత పడ్డాయి. ఈ నేపథ్యంలో కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుంకీ ఏనుగులను తెప్పించి, జిల్లాలో గజరాజుల సమస్యకు పరిష్కా రం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అది నెరవేరలేదు. త్వరలోనే రెండు కుంకీలు వస్తాయని ఎప్పటి నుంచో చెబుతున్నా ఆచరణలోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే సీతానగరం మండలం గుచ్చిమి వద్ద ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు అటవీ శాఖాధికారులు ఉపక్రమించారు. కుంకీల ద్వారా వీటిని ఇక్కడకు తరలించి, మచ్చిక చేయించి, కొన్నాళ్ల తర్వాత తరలించాలన్నది అధికారుల ఆలోచన. జిల్లా ప్రజలకు ఇది ఉపయోగపడినదే అయినప్పటికీ.. సమస్యను తమ నెత్తి మీద పెట్టడమేమిటని, జనావాసాల మధ్య పెడితే తాము బతకగలమా? అని సీతానగరం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలు, భూములను కోల్పోనున్న రైతులు
ఈ ప్రాంతంలో పలువురు గిరిజనులు, దళితులు, పేదలు సుమారు 50 ఏళ్లుగా తోటలు, వివిధ పంట లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ కందకాలు, ట్రెంచ్ కటింగ్ తవ్వకాల వల్ల తోటలు, భూములు నాశనమవుతాయని వారంతా ఆందోళ న చెందుతున్నారు. కొంతమంది రైతుల పంటలకు వెళ్లేందుకు దారి లేకుండా అడ్డుగా తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. మంగళవారం కూడా సంబంధిత తవ్వకం పనులను అడ్డుకున్నారు. బుధవారం పార్వతీపురంలోని అటవీ శాఖ కార్యాలయానికి చేరుకుని రేంజ్ అధికారి బిర్లంగి రామ్‌నరేష్‌ను కలిసి తమ ఆవేదన వినిపించారు. ఏనుగుల కోసం కందకాలు, చుట్టూ ఫెన్సింగ్‌తో పాటు, నీటి కోసం చెరువులను తవ్వించాలి. జనావాసాల మధ్య సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తే.. తాము ఎలా బతకగలమని ఆయా గ్రామస్తులు, రైతులు వాపోతున్నారు.
న్యూస్‌రీల్
సీతానగరం మండలం గుచ్చిమి రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో ఏనుగుల సంరక్షణ కేంద్రం
అక్కడే కొన్నాళ్లపాటు గజరాజులను
ఉంచేందుకు చర్యలు
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రైతులు, స్థానికులు
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025